సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |

0
562

🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨

సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా చదువుకోని నిరక్షరాస్యులు మాత్రమే కాకుండా చదువుకున్న వారు సైతం సైబర్ నేరాల బారిన పడుతూ వారు కూడబెట్టుకున్న ధనాన్ని సైబర్ నేరగాళ్ల చేతులలో పోగొట్టుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అలా ఎవరు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం విశేషంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, కనుక ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా తమల తాము రక్షించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్., గారు తెలియజేశారు.

ఈ రోజుల్లో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త కొత్త రూపాల్లో పెరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి, కొద్దిపాటి డబ్బు ఇచ్చి, మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు తెలియక చేసిన చిన్న సహకారమే పెద్ద నష్టానికి దారితీస్తుంది!

ఎలా నేరస్తులు మోసం చేస్తున్నారు?

ఇప్పటివరకు డిజిటల్ అరెస్ట్ అంటూ పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయంటూ ఫోన్ ద్వారా మన ఎకౌంటును హ్యాక్ చేసి ఖాతాలో ఉన్న సొమ్ము కాస్త కొల్లగొట్టేవారు కానీ ఇప్పుడు
కొందరు నేరస్తులు, “కొంత మొత్తం డబ్బు ఇస్తాం, మీ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిపించండి” అంటూ సంప్రదిస్తున్నారు.

▪ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలు – ఆధార్, పాన్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు వంటి వాటిని తీసుకుంటారు.

▪ఆ తర్వాత, ఆ ఖాతాను సైబర్ నేరాలకు ఉపయోగించి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడతారు.

▪ ఏదైనా సైబర్ నేరానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటివి పట్టుబడిన సమయంలో మాత్రమే పోలీసులు విచారణకు వచ్చిన తర్వాత మాత్రమే మీ పేరు/అకౌంట్ వాడుకున్నారని తెలుసుకుంటారు! అప్పటికే డబ్బులు వేరే ఖాతాలకు తరలిపోతాయి.

మీకు ఎదురయ్యే ప్రమాదాలు:

✔ మీ ప్రమేయం ఏమీ లేకపోయినా మీ పేరు మీద నేరాలు జరిగే అవకాశం ఉంది
✔ చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది
✔ మీరు తెలియక నష్టపోవచ్చు
✔ ఇతర కుటుంబాలకు, సమాజానికి కూడా ఇబ్బందులు కలిగించవచ్చు

📢 అందుకే మీరు తప్పక పాటించాల్సిన సూచనలు:

1 . మీ పేరు మీద బ్యాంక్ ఖాతాను తెరవమని ఎవరైనా డబ్బు ఇచ్చి ప్రలోభపెడితే వెంటనే నిరాకరించండి.

2 . మీ బ్యాంక్ పత్రాలు, ఏటీఎం కార్డు, పాస్‌బుక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు, తెలియని వారికి అసలు ఇవ్వకండి.

3 . మీకు ఇలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయండి.

4 . 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వండి – ఇది పూర్తిగా ఉచితం, గోప్యంగా ఉంచబడుతుంది.

🌟 మీరు చూపే జాగ్రత్త – సమాజానికి ఇచ్చే రక్షణ!

ఒక్కసారి ఆలోచించండి – తెలియక చేసిన సహాయం వల్ల మీ కుటుంబానికి, ఇతరులకు ఎంత నష్టం కలిగే అవకాశం ఉందో! మన చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు.

మీ బ్యాంకు ఖాతాను కాపాడుకోండి.
సమాజాన్ని సురక్షితంగా ఉంచేందుకు ముందడుగు వేయండి!

– కృష్ణా జిల్లా పోలీస్ శాఖ
“సైబర్ నేరాలకు చోటివ్వద్దు – జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి!”

Search
Categories
Read More
Ladakh
Ladakh Launches Community Solar Greenhouses in Remote Villages
The Union Territory of Ladakh has introduced community solar greenhouses across several...
By Bharat Aawaz 2025-07-17 06:37:13 0 886
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com