విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

0
188

విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని BC హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇటీవలి రోజులలో కొన్ని హాస్టళ్లలో పరిశుభ్రత, భద్రతా చర్యలు లేకపోవడం బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. BC సంక్షేమ శాఖ మంత్రి కే. సవిత మాట్లాడుతూ –

“ప్రతి హాస్టల్‌ మరియు గురుకుల పాఠశాలలో CCTV కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం” అని తెలిపారు.

ఆమె చెప్పినదాని ప్రకారం, ఈ ఆధునికీకరణ పనులు CSR నిధులతో వేగంగా జరుగుతున్నాయి. హాస్టళ్లలో శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Search
Categories
Read More
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 1K
Telangana
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
By Vadla Egonda 2025-07-23 10:04:52 0 926
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com