అధికారులకు,పాలకులకు, పట్టని అభివృద్ధి సమస్యలు రిటైర్డ్ టీచర్ కు పట్టింది... నగర అభివృద్ధి కమిటీ ఆరోపణలు

0
137

అభివృద్ధి చేయుట లో ముందున్న పైగేరి టీచర్ నాగరాజు ... :- నగర అభివృద్ధి పట్ల కనీస బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారులకు,పాలకులకు ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ నగర అభివృద్ధి కమిటీ కన్వీనర్ టీచర్ పైగేరి నాగరత్నరావు ప్రజలకు ఇబ్బంది కరమైనటువంటి పనులను దగ్గరుండి తానే సొంత నిధులతో ఖర్చు చేస్తూ వార్డుల్లో పర్యటన చేస్తూ అభివృద్ధి చేయుటకు ముందుకు వస్తున్నాడు. వర్షాలకు గుంతలు ఏర్పడినటువంటి స్థలాలను గుర్తించి డస్ట్ మరియు చిన్న కంకర ద్వారా ట్రాక్టర్ తో లేబర్స్ ను పెట్టి వార్డ్ లోని సమస్యలు పరిస్కారం చూపిస్తున్నాడు. గతంలో గ్రామచావిడిలో బస్టాండ్ నడి సెంటర్లో కల్లా కంపలతో నిండినటువంటి స్థలము ను కళ్ళకంపాలను కొట్టించి తీసివేయించాడు, గతంలో గూడూరు కొత్త బస్టాండు లో బస్సులు రాకపోకలు ఇబ్బందులు తలెత్తడంతో గుంతలను తన సొంత నిధుల ద్వారా మట్టిని తోలించి బస్సులో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా జేశాడు, ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ భవనం దగ్గర ఉన్నటువంటి కల్లా కంపలను తొలగించి చెడిపోయిన బోరింగ్ ను మారమ్మత్తు చేయించి దానికి విద్యుత్తును సమకూర్చి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించాడు. ఈ విధంగా నగరంలో అనేక అభివృద్ధి పనులను తన సొంత నిధులను వెచ్చించి తనకు నెలకు వచ్చినటువంటి పెన్షన్లు కొంత భాగాన్ని ప్రజల సౌకర్యాలకు అభివృద్ధికి ఇస్తూ, తన ఉదార స్వభావము చాటుతూ నగర అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ విదంగా తమ తమ ప్రాంతంలో సమస్యలు తలెత్తితే పరిష్కారం చూపుటకు టీచర్ నాగరత్నారావు మాదిరి ముందుండాలని ఇప్పటి పాలకులు, నాయకులు టీచర్ నాగరత్న రావు ను ఆదర్శం గా తిసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com