ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.

0
173

పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన *దారుల్ ఉలూం మద్రసా & హిఫ్జ్-ఎ-ఖురాన్ ఎడ్యుకేషన్ సెంటర్ (బాలికల మద్రసా) హాస్టల్ బ్లాక్* ను పొన్నూరు శాసనసభ్యులు *శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్* గారు ఘనంగా ప్రారంభించారు...

 ఈ సందర్భంగా *శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్* గారు మాట్లాడుతూ....

సుమారు రూ. 8 కోట్ల రూపాయల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో *మదర్సా భవనాలు, హాస్టల్ సౌకర్యాలు మరియు మసీదు నిర్మాణం* పూర్తి కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సమాజం విద్యారంగంలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో వెనుకబాటుతనం గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదు జిల్లాల నుంచి బాలికలను తీసుకువచ్చి మతపరమైన విద్యతో పాటు ఆధునిక విద్యను అందించే విధంగా ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.

ముస్లిం సమాజంలో ముఖ్యంగా ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ ఒక ఆదర్శప్రాయమైన ప్రయత్నం. ఖురాన్ విద్యతో పాటు ఆధునిక విద్య అందించడం వల్ల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. 

దాతల సహకారంతో ఈ నిర్మాణాలు పూర్తి చేయడం ప్రశంసనీయమని, అల్లాహ్ ఆశీస్సులతో రంజాన్ మాసం నుంచి మగపిల్లల కోసం కూడా ఇదే తరహా విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేయడం సంతోషకరమని ఎమ్మెల్యే గారు చెప్పారు.

కుల, మతాలకు అతీతంగా పేద విద్యార్థులకు కూడా విద్య అందించాలనే ట్రస్ట్ సంకల్పం గొప్పదని కొనియాడారు. ముస్లిం సమాజ ప్రగతికి విద్యే ప్రధాన మార్గమని, ఇలాంటి విద్యాసంస్థలు భవిష్యత్తులో మరిన్ని విద్యార్థులకు వెలుగునిచ్చే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఫ్తి అబ్దుల్లా బేగ్ గారు మరియు ట్రస్ట్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

 ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, ముస్లిం పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం... మార్కాపురం: మార్కాపురం జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:11:15 0 286
SURAKSHA
Manoj Verma, IPS: Championing Law and Order with Excellence
The Journey Begins "Strong policing begins with public trust, decisive...
By Fathima Safa 2026-07-28 07:32:24 0 119
Andhra Pradesh
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-06-28 07:21:22 0 119
Telangana
వరంగల్ పరిధిలో 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు కమీషనర్ పెరిధిలోని పాలు...
By CM_ Krishna 2026-01-17 05:19:07 0 483
Andhra Pradesh
మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో
మదనపల్లె కోళ్లబైలు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపురానికి చెందిన మెహతాజ్ బేగం అనే మహిళ అదృశ్యమైనట్లు...
By Pagadala Venkateswar 2026-03-15 03:53:50 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com