అధికారులకు,పాలకులకు, పట్టని అభివృద్ధి సమస్యలు రిటైర్డ్ టీచర్ కు పట్టింది... నగర అభివృద్ధి కమిటీ ఆరోపణలు

0
73

అభివృద్ధి చేయుట లో ముందున్న పైగేరి టీచర్ నాగరాజు ... :- నగర అభివృద్ధి పట్ల కనీస బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారులకు,పాలకులకు ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ నగర అభివృద్ధి కమిటీ కన్వీనర్ టీచర్ పైగేరి నాగరత్నరావు ప్రజలకు ఇబ్బంది కరమైనటువంటి పనులను దగ్గరుండి తానే సొంత నిధులతో ఖర్చు చేస్తూ వార్డుల్లో పర్యటన చేస్తూ అభివృద్ధి చేయుటకు ముందుకు వస్తున్నాడు. వర్షాలకు గుంతలు ఏర్పడినటువంటి స్థలాలను గుర్తించి డస్ట్ మరియు చిన్న కంకర ద్వారా ట్రాక్టర్ తో లేబర్స్ ను పెట్టి వార్డ్ లోని సమస్యలు పరిస్కారం చూపిస్తున్నాడు. గతంలో గ్రామచావిడిలో బస్టాండ్ నడి సెంటర్లో కల్లా కంపలతో నిండినటువంటి స్థలము ను కళ్ళకంపాలను కొట్టించి తీసివేయించాడు, గతంలో గూడూరు కొత్త బస్టాండు లో బస్సులు రాకపోకలు ఇబ్బందులు తలెత్తడంతో గుంతలను తన సొంత నిధుల ద్వారా మట్టిని తోలించి బస్సులో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా జేశాడు, ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ భవనం దగ్గర ఉన్నటువంటి కల్లా కంపలను తొలగించి చెడిపోయిన బోరింగ్ ను మారమ్మత్తు చేయించి దానికి విద్యుత్తును సమకూర్చి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించాడు. ఈ విధంగా నగరంలో అనేక అభివృద్ధి పనులను తన సొంత నిధులను వెచ్చించి తనకు నెలకు వచ్చినటువంటి పెన్షన్లు కొంత భాగాన్ని ప్రజల సౌకర్యాలకు అభివృద్ధికి ఇస్తూ, తన ఉదార స్వభావము చాటుతూ నగర అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ విదంగా తమ తమ ప్రాంతంలో సమస్యలు తలెత్తితే పరిష్కారం చూపుటకు టీచర్ నాగరత్నారావు మాదిరి ముందుండాలని ఇప్పటి పాలకులు, నాయకులు టీచర్ నాగరత్న రావు ను ఆదర్శం గా తిసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించిన పాల్ |
హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన...
By Bhuvaneswari Shanaga 2025-10-11 09:09:58 0 59
Telangana
పునరుద్ధరణతో కళకళల చెరువులు రెడీ |
హైడ్రాబాద్ నగరంలోని బుమృక్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి కావడంతో చెరువు కొత్త అందాలతో...
By Akhil Midde 2025-10-27 04:43:37 0 30
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 95
Andhra Pradesh
13,500 మహిళా పోలీసులకు శాఖ బదిలీ అవకాశం |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 13,500 మంది మహిళా...
By Bhuvaneswari Shanaga 2025-10-01 09:04:15 0 66
Andhra Pradesh
విశాఖ తీరంలో విదేశీయుడి మృతిపై అనుమానాలు |
విశాఖపట్నం తీరంలో ఉన్న యారడా బీచ్‌లో ఒక విదేశీయుడు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై...
By Bhuvaneswari Shanaga 2025-10-06 05:26:10 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com