శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.

0
84

సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్ చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడదూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్ కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాతారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50 వేల నగదు అపహరణ చేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరి అప్ప్పుడు కూడా 8తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
Karnataka Governor Returns Bill on Lake Buffer Zone Reduction |
Karnataka Governor Thaawarchand Gehlot has returned the bill reducing lake buffer zones to the...
By Pooja Patil 2025-09-16 07:12:45 0 207
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 32
Telangana
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
By Sidhu Maroju 2025-11-29 12:51:25 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com