రాజమండ్రి లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

0
252

*రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్*

 

రాజమహేంద్రవరం: ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనగా ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నూతనంగా నిర్మించిన ఎగ్జామినేషన్ బిల్డింగ్, గౌతమి బ్లాక్ పేరుతో నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంద్రావతి బ్లాక్ పేరుతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఎస్.ప్రసన్న శ్రీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి.జ్యోతిర్మయి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి.విజయ నిర్మల, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:36:19 0 478
Bharat Aawaz
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People Bharat Aawaz is not just a media...
By Bharat Aawaz 2025-06-22 17:57:29 0 3K
Andhra Pradesh
విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస్థ* *31-12-2025*     *పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన...
By Rajini Kumari 2025-12-31 10:51:20 0 280
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. తిర్యాణిలో 9 మంది ముఠా అరెస్ట్
🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా...
By Chunarkar Jagadeesh 2026-07-27 16:03:09 0 292
Telangana
వరంగల్ జిల్లా నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి....
వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట...
By Gujile Ramu 2026-07-09 01:56:09 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com