ఎవరు సైకోనో తెలుగు ప్రజలందరికీ తెలుసు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్.....

0
144

వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి.....

 

మార్కాపురం...

 

             వైసీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణల లో ఎవరు సైకోనో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుసు అని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ ఆదివారం న ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్బంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ అప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిన అభిమానులను కొట్టే హీరో బాలకృష్ణ సైకోనా లేక ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకొనే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా అన్నది తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదన్నారు..సైకో అని దశాబ్దాల కిందటే బాలకృష్ణకు ట్యాగ్ ఉందని,ఓ కేసు నుంచి బయటపడేందుకు తనకు మెంటల్ అని స్వయంగా ఆయనే సర్టిఫికేట్ తీసుకొన్న సందర్భాలున్నాయని,ఇది తెలుగు ప్రజలకు తెలియందా అని ఆయన వ్యాఖ్యానించారు..బాలకృష్ణ ఓ సైకో అని జనం ఇంకా మర్చిపోలేదని,ఇతరులపై విమర్శలు చేసి తానే సైకోనని బాలయ్య పదే పదే ప్రజలకు గుర్తుచేస్తున్నారన్నారు..సైకోల వద్దకు వెెళ్లేందుకు జనం జంకుతారని,అదే మాదిరిగా బాలకృష్ణ దగ్గరకు వెళ్లేందుకు కూడా అభిమానులు సైతం జంకుతారని ఆయన గుర్తుచేశారు..కానీ జగన్ తో ఒక్కసారి చెయ్యి కలిపితే చాలు తమ జీవితం సార్థకమని భావించే కోట్లాది అభిమానులు తమ పార్టీ అధినేత జగన్ కు ఉన్నారని పేర్కొన్నారు..మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు బాలకృష్ణ అని గుర్తు చేశారు...అధికారం ఉంది కదా అని అహంకారం తో మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హెచ్చరించారు....

Search
Categories
Read More
Telangana
ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో...
By Sidhu Maroju 2025-10-15 13:48:12 0 110
Andhra Pradesh
కర్నూలు లో మాంసం దుకాణాల తనిఖీలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈరోజు కర్నూల్లో పలు...
By krishna Reddy 2025-12-14 09:16:43 0 160
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM
By Hazu MD. 2025-08-19 09:24:05 0 964
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com