దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు

0
310

*ప్రచురణార్థం*

02.04.26

 

*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*

 

*యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*

 

 *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*

 

 *సానుకూలంగా స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ* 

 

*న్యూఢిల్లీ/ విజయవాడ* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభ లో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. 

 

యువనేత, రాష్ట్ర విద్య - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.

 

 ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు 

 

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు. 

 

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. 

 

దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

Search
Categories
Read More
Telangana
సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ?
పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్...
By Ponnala Srinivasrao 2026-08-09 01:27:00 0 146
Andhra Pradesh
మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే...
By Pagadala Venkateswar 2026-02-11 05:58:26 0 209
BMA
Pedagogical Power: Daily Press as a Learning Tool
The press serves as a dynamic educational resource for schools, universities, and competitive...
By JoinBMA 2026-08-21 10:44:31 0 71
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఒడిస్సా యువకుడు అనుమానాస్పద మృతి.
నిమ్మనపల్లె మండలం పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో కోళ్ల ఫారాలకు కాపలాగా పనిచేస్తున్న ఒడిస్సా...
By Pagadala Venkateswar 2026-02-16 05:04:54 0 205
Andhra Pradesh
ఏఐటీయూ 18వ మహాసభలు
*ఎమ్మిగనూరు నియోజకవర్గం AITUC 18, వ మహాసభలు పాత మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో నిర్వహించడం జరిగింది.*...
By Boya Dasthagiri 2026-03-23 12:22:02 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com