అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన

0
125

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి. రైల్వే గేట్ నెం.249, హనుమాన్ ఆలయం సమీపం, మడికట్ల బస్తీ, తుర్కపల్లి, బుడగ జంగం బస్తీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. బియ్యం, గృహోపకరణాలు, టీవీలు సహా ఇంటి వస్తువులు నీటిలో మునిగిపోయాయి. ఒక కుటుంబానికి డోలి రమేష్ ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సమస్యలపై మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి,హైడ్రా బృందం వెంటనే ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది.  ఈ తనిఖీలో జిహెచ్ఎంసి అధికారులు ఎస్.ఈ. చెన్నారెడ్డి డి.ఈ. రఘు, ఏ.ఈ. రవళి, హైడ్రా ఇన్‌ఛార్జ్ మనికంఠ పాల్గొన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించినందుకు జిహెచ్ఎంసి అధికారులు,హైడ్రా టీంకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డ్ కమ్యూనిటీ మెంబర్ శోభన్ బాబు , మహమ్మద్ జావిద్, జిహెచ్ఎంసి అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 14
Punjab
Punjab: Gurdaspur Police arrests two 'Pakistani spies' for sharing details related to Indian Armed Forces
Gurdaspur: Punjab Police Foils Major Espionage Plot, Two Arrested for Leaking Military Secrets to...
By BMA ADMIN 2025-05-20 08:55:52 0 2K
Arunachal Pradesh
नया अफसर लोगन के पौधारोपण पे उठल सवाल अरुणाचल
अरुणाचल में नया भर्ती अफसर लोगन #पौधारोपण करके #पर्यावरण बचाव के बात रखे। ई सब #ग्रीनमिशन के...
By Pooja Patil 2025-09-12 12:42:32 0 103
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com