కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
128

సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB కాలనీ,రవి కాలనీ, బంజారా కాలనీలను కాలనీ వాసులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు వేయాలని, ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేసి అందులో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే కాలనీల వాసులకు ప్రయోజనం ఉంటుందని కాలనీల వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.కాలనీలలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్ని కాలనీలను కలియతిరిగిన ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని, కాలనీల వాసులు కూడా కలసికట్టుగా తమకేం కావాలో కూర్చుని చర్చించుకుని నా దృష్టికి తీసుకువస్తే, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ని కూడా కాలనీలకి పిలిపించి ఇరువురము కలిసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తానని చెప్పారు. ఈ కాలనీలో పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి నాగినేని సరిత, మరియు కాలనీలవాసులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
బీసీ రిజర్వేషన్లపై మోసం చేశారంటూ సీఎం పై విమర్శ |
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంచలన...
By Bhuvaneswari Shanaga 2025-10-13 11:40:36 0 25
Sports
వన్డే సిరీస్‌ కోసం టీమిండియా బయలుదేరింది |
టీమిండియా వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు...
By Bhuvaneswari Shanaga 2025-10-16 09:31:05 0 60
Tripura
Tripura Leaders Summoned Over Alleged Communal Remarks |
Authorities in Tripura have issued notices to two political leaders for allegedly making communal...
By Pooja Patil 2025-09-15 12:39:13 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com