కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
130

సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB కాలనీ,రవి కాలనీ, బంజారా కాలనీలను కాలనీ వాసులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు వేయాలని, ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేసి అందులో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే కాలనీల వాసులకు ప్రయోజనం ఉంటుందని కాలనీల వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.కాలనీలలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్ని కాలనీలను కలియతిరిగిన ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని, కాలనీల వాసులు కూడా కలసికట్టుగా తమకేం కావాలో కూర్చుని చర్చించుకుని నా దృష్టికి తీసుకువస్తే, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ని కూడా కాలనీలకి పిలిపించి ఇరువురము కలిసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తానని చెప్పారు. ఈ కాలనీలో పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి నాగినేని సరిత, మరియు కాలనీలవాసులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 914
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 195
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com