షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.

0
198

హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నెలవయ్యింది. వివరాలలోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడ్ని నెలకొల్పి వారం రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలోనే కృత్రిమ కొలను, షవర్ ను ఏర్పాటు చేసి అందులోనే ఎటువంటి హంగు ఆర్భాటాలు, డీజేలు, బ్యాండ్ మోతలు లేకుండా నిరాడంబరంగా ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేశారు. గణపతి మహారాజ్ కృత్రిమ కొలనులోనే షవర్ బాత్ చేస్తూ అందులో కరిగి పోతుండగా మహిళా ఉద్యోగులు, కార్మికులు కోలాటాలు ఆడుతూ వీడ్కోలు పలికారు.

      Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలులో బస్సు అగ్నిప్రమాదం.. అధికారుల స్పందన |
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని...
By Akhil Midde 2025-10-24 09:53:51 0 285
Tripura
“ত্রিপুৰা: ২১ কৃষি বজাৰ ডিজিটেল, কৃষকৰ আয় বঢ়াবলৈ”
ত্রিপুৰা চৰকাৰে ২১টা #AgricultureMarket ক #eNAMৰ অধীনত ডিজিটেল মাৰ্কেটলৈ পৰিণত কৰাৰ সিদ্ধান্ত...
By Pooja Patil 2025-09-12 05:23:49 0 70
BMA
🖋 Bal Gangadhar Tilak: The Journalist Who Set a Nation on Fire
🖋 Bal Gangadhar Tilak: The Journalist Who Set a Nation on Fire Using the Power of the Press to...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-29 12:27:42 0 2K
Andhra Pradesh
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను భర్తరాఫ్ చేయాలి, (సిపిఎం
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన...
By mahaboob basha 2025-09-04 14:20:14 0 211
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com