వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
806

మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్ 

 

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి బస్తీలు కాలనీల లోకి వర్షపు నీరు చేరి ఇళ్ళలోకి కూడా రావడంతో ఆయా బస్తీ, కాలనీల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురి అయ్యారు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్ఖానా లోని నారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించి అక్కడి ప్రజలను పరామర్శించారు.ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇళ్ళలోని వస్తువులు నీట మునిగాయి.స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే అక్కడికి పిలిపించుకుని ఇళ్ళలోకి వచ్చిన నీటిని బయటకు పంపించాలని, వారికి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని,ఏ అవసరం వచ్చినా నాకు సమాచారం ఇస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటానని, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju 

Search
Categories
Read More
BMA
Unsung Heroes: Rural Journalists Changing India
Unsung Heroes: Rural Journalists Changing IndiaAcross India's rural landscape, a dedicated group...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-28 12:35:00 0 2K
Telangana
Advocate Safety Needed | వకీల భద్రత అవసరం
తెలంగాణలో వకీలు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆెక్ట్ ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...
By Rahul Pashikanti 2025-09-11 05:25:00 0 24
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 822
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 579
Telangana
Urea Shortage Clash in Gajwel | గజ్వేల్‌లో యూరియా కొరతపై ఘర్షణ
గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో యూరియా ఎరువుల కొరత కారణంగా ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎరువులు...
By Rahul Pashikanti 2025-09-09 07:14:16 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com