YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.

0
179

ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల

ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే నాయకుడే లేరని విమర్శ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారని, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో ఎప్పుడో చచ్చిపోయిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని అన్నారు. 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా గురువారం ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

 

మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. తొలుత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు" అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

 

అనంతరం కావలి మండలం ఆముదాలదిన్నెలోనూ షర్మిల పర్యటించి, ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతావజ్ టీం #శివనాగేంద్ర...
By SivaNagendra Annapareddy 2025-12-26 04:56:23 0 655
SURAKSHA
Rajesh Rajora IAS: Architect of Madhya Pradesh’s Growth
A seasoned administrator leading transformative development through strategic governance and...
By Lokeshwari Panthadi 2026-08-01 09:35:01 0 111
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలు జాకెట్లు
చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును...
By Kothuru Murali 2025-12-24 04:41:23 0 233
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 208
Kerala
Kerala Strengthens Cultural Heritage Conservation Efforts
Kerala continues to strengthen its cultural heritage conservation initiatives through the...
By Fathima Safa 2026-06-27 12:58:23 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com