నీటి కొరతతో ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు
Posted 2026-09-17 13:52:37
0
88
భారత్ అవాజ్ న్యూస్ :కదిరి వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో కదిరి ప్రాంతంలో బోర్ల నీటి లభ్యత తగ్గింది. దీంతో పంటలకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. టమోటా, వేరుశనగ, కూరగాయలు తదితర పంటలు పూత, కాయ దశలో ఉండటంతో నీటి కొరత వల్ల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. నీటి కోసం అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
పంటలను రక్షించేందుకు నీటిని పొదుపుగా వినియోగించాలని, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణకు వర్షపు నీటిని నిల్వ చేయడం, ఫార్మ్ పాండ్లను సంరక్షించడం వంటి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం...
Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు.
Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ...
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్
హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు...
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
వివిధ కీలక అంశాలపై చర్చించి...