హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|

0
130

● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం

● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు

● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన

అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది. 

బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు అందింది.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 

ఈ పనుల మార్గంలో కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్-3, రింగ్ మెయిన్-1కు చెందిన 1,500 మిల్లీమీటర్ల గ్రావిటీ మెయిన్ ఉండటంతో జంక్షన్ పనులు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ అంతరాయం కారణంగా శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, అల్లాబండ,శంషాబాద్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, అల్లాబండ, భోజగుట్ట, జూబ్లీహిల్స్, టాటీఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్‌పేట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడింది.

పనులు పూర్తయిన అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది.

అంతరాయం సమయంలో ప్రజలు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్...
By Kothuru Murali 2026-04-22 14:33:09 0 130
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 278
Andhra Pradesh
మదనపల్లెలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి, క్వింటాకు రూ.3700.
మదనపల్లెలో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శనివారం మార్కెట్‌కు 783 మెట్రిక్ టన్నుల టమాటాలు...
By Pagadala Venkateswar 2026-06-07 13:10:58 0 127
Telangana
చలో హైదరాబాద్ కు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వినతి..
ఈనెల 10 న జరుగునున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఉద్యోగు, ఉపాధ్యాయులు పాల్గొన్నందుకు అనుమతి...
By Bonagiri RaviShankar 2026-09-08 20:40:52 0 129
Andhra Pradesh
మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.
మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా...
By Pagadala Venkateswar 2026-05-14 14:33:48 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com