పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
166

మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు..

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్ రెడ్డి  జూలై నెలలో నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లను విడుదల చేయడం జరిగింది.. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువత పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కోసం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగార్జున గారు స్కానర్ రూపంలో ఈనెల 16వ తేదీ వరకు ఫామ్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేసుకున్న యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ మండపంలో ఆగస్టు 20వ తేదీ స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి రోజు నుండి  నాన్న  కీ,,శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు మరియు పుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు..రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు,

అదేవిధంగా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ యాడ్ లో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరుగుతున్నాయి తెలిపారు,

విద్యార్థుల కోసం ఇంత మంచి కార్యక్రమం మంచిర్యాల నియోజకవర్గానికి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి వర్యులు  మల్లు భట్టి విక్రమార్కకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.‌ తొలుత టిఫిన్ పంపించడం జరుగుతుందని, ఆ తర్వాత దసరా వరకు మధ్యాహ్న భోజనం పంపిణీ ఉంటుందన్నారు. దసరా తర్వాత చెన్నూర్ లో అమలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మినహా పాఠశాల, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈ భోజనం, టిఫిన్ పథకం వర్తిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ కార్పొరేటర్ లు తనను విడిచి వెళ్తారని ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో విభేదాలు ఉన్నట్లు ప్రజల్లో అపోహ సృష్టించాలనుకునే 

బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు,

రేపు నుంచి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తాగునీరు సరఫరా జరగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు,

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.
మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-03-10 04:40:35 0 192
Andhra Pradesh
మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్‌కు రూ.70 పెరుగుదల.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న...
By Pagadala Venkateswar 2026-02-18 07:03:43 0 197
Andhra Pradesh
ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలతో చంద్రబాబు రేపు కీలక భేటీ.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి...
By Pagadala Venkateswar 2026-09-04 06:18:08 0 133
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 180
Telangana
‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
By Ponnala Srinivasrao 2026-03-09 11:58:35 0 359
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com