ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|

0
179

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్  అవినాష్ మహంతి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో "హెల్మెట్ బ్యాంక్" (Helmet Bank) కార్యక్రమాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.

ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, వారికి జరిమానా విధించడమే కాకుండా, పోలీసుల వద్ద ఉన్న హెల్మెట్ బ్యాంకు నుండి ఒక హెల్మెట్‌ను తాత్కాలికంగా అందజేస్తారు. ఈ హెల్మెట్ పొందిన వాహనదారులు 24 గంటల వ్యవధిలో తమ కోసం కొత్త హెల్మెట్‌ను కొనుగోలు చేసి, పోలీసుల వద్ద తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాల్సి ఉంటుంది. 

ఈ సందర్భంగా మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీ  కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ.. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాంతక ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ, లక్ష్మి, తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ  జి. శంకర్ రాజు, ఇన్స్పెక్టర్  వి. సర్దార్ నాయక్, బేగంపేట అదనపు ఇన్స్పెక్టర్ జి. జానకి రాములు, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్. శంకరయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఇప్పటికే ఈ కార్యక్రమం బేగంపేటలో విజయవంతంగా నడుస్తోందని, త్వరలోనే ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దీనిని అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పల్లె పండగ ద్వారా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*పత్రికా ప్రకటన*   *పల్లె పండుగతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభ*   *జిల్లాలో...
By Rajini Kumari 2026-01-13 16:08:18 0 236
Telangana
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే...
By Sunka Santhosh 2026-05-16 07:13:04 0 182
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 204
Tripura
CBI Raids in Tripura Linked to Nagaland Varsity Graft Case
The CBI has launched raids in Agartala, along with locations in Nagaland and Assam, in connection...
By Bharat Aawaz 2025-07-17 07:46:26 0 1K
Telangana
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
By Gujile Ramu 2026-06-03 07:40:23 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com