జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,

0
1K

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం వల్లే తల్లికి వందనం పథకం అమలు చేశారని వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. జగన్ కూటమి సర్కారుపై ఒత్తిడి తేవకపోతే తల్లికి వందనం పథకం పూర్తిగా నీరుగారి పోయేదని ఆయన వెల్లడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూనే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను గురుతరంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటేనే వైయస్ కుటుంబమని దేశవ్యాప్తంగా పేరు ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అన్నది ప్రజలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన గుర్తు చేశారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సంక్షేమ పథకాల దూకుడును కొనసాగించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమ పథకాలను గోతిపెడతారని ప్రతిసారి రుజువైందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ఊపిరిగా బతికినా కుటుంబం వైయస్ జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ పథకాలు స్థిరంగా ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునుముందు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అండగా జగన్ ఉన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 157
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న...
By Kothuru Murali 2026-03-11 11:04:41 0 109
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 189
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 12:58:04 0 37
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com