జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,

0
1K

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం వల్లే తల్లికి వందనం పథకం అమలు చేశారని వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. జగన్ కూటమి సర్కారుపై ఒత్తిడి తేవకపోతే తల్లికి వందనం పథకం పూర్తిగా నీరుగారి పోయేదని ఆయన వెల్లడించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూనే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను గురుతరంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం అంటేనే వైయస్ కుటుంబమని దేశవ్యాప్తంగా పేరు ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అన్నది ప్రజలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన గుర్తు చేశారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సంక్షేమ పథకాల దూకుడును కొనసాగించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజా సంక్షేమ పథకాలను గోతిపెడతారని ప్రతిసారి రుజువైందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ఊపిరిగా బతికినా కుటుంబం వైయస్ జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ పథకాలు స్థిరంగా ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునుముందు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అండగా జగన్ ఉన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Telangana
Prashanth takes charge as new SHO of Alwal Police Station
'Bharat Aawaz News Channel' congratulates Prashant garu on assuming charge as the new SHO of Alwal.
By Sidhu Maroju 2025-07-05 15:30:24 0 1K
Himachal Pradesh
शिमला में दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन
शिमला में १३ और १४ सितंबर को दो दिवसीय राष्ट्रीय सहकारी सम्मेलन का आयोजन किया जा रहा है। इस...
By Pooja Patil 2025-09-13 07:03:06 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com