లక్డీకాపూల్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ

0
371

హైదరాబాద్, లక్డీకాపూల్:

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని వాసవి సేవా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అభిలాష్, అంతర్జాతీయ సభ్యులు, RV శ్రీనివాసరావు, స్టేట్ కన్వీనర్ గంగాధర్, రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్, రాష్ట్ర సభ్యులు ఎండి నజీర్, మొసలి ప్రభు కుమార్ లతో పాటు సంస్థకు చెందిన వివిధ స్థాయిల అధికారులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంస్థ విస్తరణ, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజలకు అందించాల్సిన సేవలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్క అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ, బాధితులకు తగిన న్యాయం అందించడానికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

అలాగే ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలను సమీక్షించి, అత్యుత్తమ సేవలు అందించిన ప్రతినిధులను, అధికారులను అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా ప్రజాసేవ చేస్తూ, సంస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం
*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర...
By Rajini Kumari 2026-06-06 11:28:23 0 423
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి...
By Kothuru Murali 2026-05-09 14:50:50 0 144
Andhra Pradesh
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు.
    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌...
By Pagadala Venkateswar 2026-06-11 05:41:59 0 109
Telangana
సామాజిక సేవలో డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ ను అభినందించి సన్మానించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి /ఆల్వాల్.   సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళుతూ అందరి మన్ననలు...
By Sidhu Maroju 2025-07-28 11:41:26 0 896
Andhra Pradesh
పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు...
By Kothuru Murali 2026-06-07 06:16:25 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com