Telangana medchal mla malla Reddy focus on A.P

0
244

ఏపీపై తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫోకస్.. తిరుపతిలో కొత్త వర్సిటీ 

: ఏపీలో విద్యాసంస్థల విస్తరణకు మల్లారెడ్డి శ్రీకారం

తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు

వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కీలక ప్రకటన

గతేడాది తిరుపతి, విశాఖలో కాలేజీలు కొనుగోలు చేసిన మల్లారెడ్డి

తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఏపీలో తన విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా కీలక అడుగు వేశారు. తిరుపతిలో 'మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని తిరుమలలో వెల్లడించారు.

 

నిన్న‌ ఉదయం శ్రీవాణి ట్రస్ట్ దాతగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 35 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందిస్తున్నానని, తిరుపతిలో యూనివర్సిటీ స్థాపించాలన్న తన చిరకాల కల నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2025లోనే ఈ ఆలోచన చేశానని, శ్రీవారి దయతో ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని తెలిపారు.

 

తెలంగాణలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న మల్లారెడ్డి, ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో విశాఖపట్నంలోనూ మరో కళాశాలను కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

 

పాల వ్యాపారంతో జీవితం ప్రారంభించి, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి, ఇప్పుడు తన 'మల్లారెడ్డి' బ్రాండ్‌ను ఏపీకి విస్తరిస్తున్నారు. అయితే, గతేడాది కొనుగోలు చేసిన కాలేజీ ప్రాంగణంలోనే ఈ డీమ్డ్ వర్సిటీని అభివృద్ధి చేస్తారా? లేక కొత్త ప్రాంగణాన్ని ఎంచుకుంటారా? అనే దానిపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...
By Pagadala Venkateswar 2026-06-12 14:19:20 0 122
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 143
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 223
Telangana
అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల...
By Sidhu Maroju 2026-01-01 13:50:48 0 214
Telangana
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*  ‎నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
By Ponnala Srinivasrao 2026-05-13 00:05:15 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com