ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు

0
151

ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు

ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో "సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్"ను ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా లారీలు, బస్సులు మరియు ఇతర భారీ గూడ్స్ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఈ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలులో ఉంటాయి.

అదేవిధంగా కార్లు, బస్సులు మరియు ఇతర చిన్న వాహనాలకు ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు

నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే భారీ వాహనాలు (లారీలు, బస్సులు) మరియు మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వచ్చే భారీ వాహనాలు (లారీలు, బస్సులు) మళ్లింపు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వెళ్లే భారీ వాహనాలు మోట్టు – పోరుమామిళ్ల – మైదుకూరు మార్గం మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.

నంద్యాల నుంచి మార్కాపురం వైపు వెళ్లే భారీ వాహనాలు నంద్యాల – ఆళ్లగడ్డ – మైదుకూరు – పోరుమామిళ్ల –తాటిచెర్ల మోటు మార్గం మీదుగా ప్రయాణించాల్సిందిగా కోరారు.

వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు

మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాలు అవసరమైతే పందిళ్లపల్లి టోల్ గేట్ వద్ద నిలుపుదల చేసుకోవాలి.

నంద్యాల నుంచి మార్కాపురం వైపు వచ్చే వాహనాలు భీమేశ్వరం ఆలయం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి ఉంచుకోవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కంటోన్మెంట్ నాయకుల సంబరాలు.!
సికింద్రాబాద్:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో...
By Sidhu Maroju 2025-11-14 09:21:28 0 270
Andhra Pradesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-31 10:06:06 0 237
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Gadiyapudi Narendra 2026-02-17 15:57:29 0 236
Andhra Pradesh
మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.
ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-18 04:14:04 0 145
Telangana
నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-06-26 06:40:13 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com