జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు

0
276

గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై JBCCI-12వ వేతన ఒప్పందం ఏర్పాటు మరియు కార్మికుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, సింగరేణిలో ఆయా ఫెడరేషన్లకు చెందిన INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి జూలై 1న నిర్వహించనున్న కార్యక్రమాలపై గోదావరిఖనిలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు,ఈ సమావేశంలో INTUC నుండి డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నుండి వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నుండి రాజిరెడ్డి, రాజమౌళి, HMS నుండి సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు మరియు JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణ ప్రారంభం కోసం జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జూన్ 29,శ్రీరాంపూర్ – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం భూపాలపల్లి – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూన్ 30,కొత్తగూడెం – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూలై 1,కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం,అనంతరం విలేకరుల సమావేశంలో,జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్!
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్...
By Sadaq Sadaq 2026-09-09 01:18:26 0 100
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 199
Telangana
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్...
By Bouth Arun 2026-05-03 12:59:58 0 334
Andhra Pradesh
ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం...
By Benguluri Madhubabu 2026-03-21 07:38:07 0 261
Andhra Pradesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
By Pagadala Venkateswar 2026-06-16 13:22:38 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com