ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.

0
97

ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ

క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య సమాలోచనలు 

ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మిస్తామన్న లోకేశ్

అంతర్జాతీయ పద్ధతులతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వెల్లడి

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 

ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధి, క్రీడల్లో అత్యుత్తమ సంస్కృతిని నెలకొల్పడం వంటి అంశాలపై తామిద్దరం ఆసక్తికరంగా చర్చించుకున్నామని లోకేశ్ తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతులను అందిపుచ్చుకుని, భవిష్యత్ ఛాంపియన్‌లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామని మంత్రి లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించి, ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

 

ఈ భేటీ సందర్భంగా జాంటీ రోడ్స్ తాను సంతకం చేసిన బ్యాట్ ను లోకేశ్ కు బహూకరించారు. అటు, లోకేశ్ కూడా తన యువగళం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని రోడ్స్ కు అందించారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 340
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-11-25 12:22:13 0 208
Andhra Pradesh
సావిత్రిబాయి పూలే ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే...
By John Baji 2026-01-03 13:53:40 0 262
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com