"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|

0
199

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.

గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఈ పుణ్యక్షేత్రంలో ఆయన సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ల ను దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, సరస్వతి అంత్య పుష్కరాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి నెలకొనాలని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. 

పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. 

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం పెద్దారవీడు మండలం, సుంకేసుల...
By Chennaiah Kati 2026-06-29 17:51:28 0 177
SURAKSHA
Flood Rescue: Goa Police Saves Lives During Monsoon
During heavy monsoon rains, Goa Police acts as first responder. Officers use boats and rafts to...
By Kalaga Sailaja 2026-07-03 05:55:41 0 91
Telangana
తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు...!
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత...
By Sunka Santhosh 2026-06-17 09:59:02 0 142
Andhra Pradesh
మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
ప్రచురణార్ధం.29.01.26    *మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం*   *...
By Rajini Kumari 2026-01-29 13:42:18 0 263
Andhra Pradesh
ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయొద్దు: శ్రీమతి బుట్టా రేణుక
* – చేనేతల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, స్వావలంబనను కాపాడాలి. * – మాచాని సోమప్ప గారి...
By Boya Dasthagiri 2026-03-27 14:23:11 0 369
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com