ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయొద్దు: శ్రీమతి బుట్టా రేణుక

0
368

* – చేనేతల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, స్వావలంబనను కాపాడాలి.

* – మాచాని సోమప్ప గారి దూరదృష్టితో ఏర్పడిన సొసైటీలను బలోపేతం చేయాలి, విలీనం కాదు.

* – అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేస్తే చేనేత కుటుంబాలకు తీవ్ర నష్టం.

* – మార్కెటింగ్ పేరుతో సొసైటీల విలీనం అనవసరం, చేనేతల ఉనికికి ముప్పు.

 

 ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో)లో విలీనం చేసే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

చేనేత అంటే ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు అంటే చేనేత అనే స్థాయిలో ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చిన పద్మశ్రీ డాక్టర్ మాచాని సోమప్ప గారి దూరదృష్టి, కృషి ఫలితంగా ఏర్పడిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు వేలాది చేనేత కుటుంబాలకు జీవనాధారంగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు. అలాంటి సొసైటీలను ఆప్కోలో విలీనం చేయడం ద్వారా చేనేతల అస్తిత్వం, స్వావలంబన, ఆస్తులు మరియు ఉపాధి ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కామార్తి నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎం.కే. శివప్రసాద్, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడు చేనేత మల్లి, అలాగే చేనేత సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Cm revanth reddy congratulated narimallia pravalika
చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల...
By G k Nookala 2026-07-18 10:31:31 0 145
SURAKSHA
Shurbir Singh IAS: Leading Ladakh with Vision and Resol
From Revenue Reforms to Urban Development—A Bureaucrat Dedicated to Transparent,...
By Lokeshwari Panthadi 2026-07-29 05:26:29 0 112
Telangana
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్." హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
By Sidhu Maroju 2026-06-29 08:47:51 0 102
BMA
Newsroom Collaborations: Teaming Up for Solutions
Complex civic issues, such as urban waste management, cannot be solved in isolation. Indian...
By JoinBMA 2026-08-22 04:20:27 0 82
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్   ...
By Rajini Kumari 2026-01-21 15:01:40 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com