సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి

0
235

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని మాజీ మంత్రి కే. తారకరామారావు (KTR) గారు, ఎమ్మెల్సీ ఎల్. రమణ గారు కలిసి విజ్ఞప్తి చేశారు

‎సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు

గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుంది, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించా రు

‎2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరింది. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని విజ్ఞప్తి చేశారు

Search
Categories
Read More
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 220
Andhra Pradesh
22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం
పత్రిక ప్రకటన  *22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం*   *290...
By Rajini Kumari 2026-05-15 12:09:39 0 163
Telangana
పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి...
By Ponnala Srinivasrao 2026-04-19 01:30:39 0 141
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 537
Andhra Pradesh
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
By Gadiyapudi Narendra 2026-02-07 13:56:26 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com