22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం

0
162

పత్రిక ప్రకటన 

*22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం*

 

*290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించాం*

 

*మరో 202 అర్జీలను 15 రోజులలలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం*

 

*ఏలూరులో నిర్వహించిన 22ఏ మెగా పరిష్కార మేళా లో స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించి, వాటిని అధికారులతో కలిసి పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్*

                   ఏలూరు, మే, 15 : 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం 22ఏ మెగా పరిష్కార మేళ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి దరఖాస్తులను రికార్డులతో పరిశీలించి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22 ఏ జాబితా నుండి తొలగించి, సంబంధిత రైతులకు తొలగింపు ఉత్తరవులను అప్పటికప్పుడే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత డిసెంబర్ లో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22ఏ మెగా పరిష్కార మేళ కార్యక్రమాన్ని నిర్వహించి వందలాది ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అభినందించి రాష్ట్రమంతా ఇదేవిధంగా 22ఏ మెగా పరిష్కార మేళ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారన్నారు. ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22 ఏ జాబితా నుండి తొలగించి, ఉత్తరువులను సంబంధిత ప్రజలకు అందించామని, మరో 202 అర్జీలను పరిశీలించి 15 రోజులలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు. కొన్ని దేవాదాయ శాఖకు భూములకు సంబంధించి దరఖాస్తులు అందాయని, వాటిని అధికారులకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి, ఈరోజు పరిష్కారం కానీ సమస్యలను అన్ని పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 771 ఎకరాలకు సంబంధించి భూ పరిపాలన ముఖ్య కమీషనర్ కార్యాలయంనకు ఆదేశాల ననుసరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో డేటా లేదని, రాజకీయ కక్షలతో కొన్ని భూములను 22ఏ జాబితాలో చేర్చారన్నారు. ప్రజలు, వయోవృద్ధులు గత ప్రభుత్వ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ సమస్యలు పరిష్కారం కాక విసిగిపోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబాబునాయుడు చొరవతో గత ప్రభుత్వ రాజకీయ కక్షలతో 22ఏ జాబితాలో చేర్చిన భూములకు విముక్తి కలుగుతున్నదన్నారు. మేళా కు వచ్చిన ఎంతోమంది వృద్దులు తాము చాలాకాలంగా తమ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నామని, ఈరోజుతో తమ సమస్య పరిష్కరించి వెంటనే తమ భూమిని 22ఏ జాబితా నుండి తొలగిస్తూ ఉత్తరువులు కూడా అందించడం ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని తెలియజేస్తూ తనకు కృతఙ్ఞతలు తెలియజేయడం, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు భూ రికార్డులను సమావేశానికి తీసుకురావడం ముఖ్యంగా నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలకు సంబందించిన రికార్డులను కృష్ణా జిల్లా నుండి తీసుకువచ్చి ఇంతపెద్దఎత్తున సమస్యల పరిష్కారానికి కృషి చేసారని ఈ సందర్భంగా వారిని మంత్రి మనోహర్ అభినందించారు. అంతిమంగా ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు, సుపరిపాలన భరోసాను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.

 

        జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, మాట్లాడుతూ 22ఏ మెగా పరిష్కార మేళ కార్యక్రమాన్ని గత డిసెంబర్లో విజయవంతంగా నిర్వహించామని, 1199 భూ సమస్యలకు గాను 1147 దరఖాస్తులను అక్కడిక్కడే పరిష్కరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో రెండవ దఫాగా 22ఏ మెగా పరిష్కార మేళా ను నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. 

         అనంతరం లబ్దిదారులకు వారి భూములను 22ఎ నుండి తొలగించిన ఉత్తరువులను మంత్రి అందజేశారు. 

          జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యే లు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, డి ఆర్ ఓ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు కిషోర్, రమణ, సర్వే శాఖాధికారి అన్సారీ, ఏపియస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డిసి యంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న ), రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, వివిధ మండలాల తహసీల్దార్లు,రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో...
By Chennaiah Kati 2026-03-09 13:36:49 0 386
Rangareddy
పర్మిషన్ ఒకలా.. నిర్మాణం మరోలా?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్‌లో భవన నిర్మాణాలపై పలు అనుమానాలు...
By Ponnala Srinivasrao 2026-08-12 06:55:22 0 189
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీ
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం...
By Chunarkar Jagadeesh 2026-06-26 12:11:14 0 268
Telangana
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి..
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ...
By Ponnala Srinivasrao 2026-05-25 02:45:14 0 138
Andhra Pradesh
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
By Gadiyapudi Narendra 2026-01-23 15:55:43 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com