బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|

0
30

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన బస్తీల పర్యటనలో భాగంగా సోమవారం రసూల్ పుర (వార్డు2) లోని శివాలయం వీధి, గన్ బజార్ కమ్యూనిటీ హాల్ ఏరియా, ఇలాహీ మజీద్ ఏరియా లలోని బస్తీలలో ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు .

వారి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ తాగునీరు, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ విభాగాల అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు.అనంతరం బస్తీ వాసులతో మాట్లాడుతూ...

కంటోన్మెంట్ నియోజకవర్గంలో బస్తీలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని,గత పాలకుల నిర్లక్ష్యమే బస్తీల దుర్గతికి కారణమని, అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులను తెచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని,  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వంలో బస్తీలను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.

ఈ బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే  తో పాటు గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com