తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

0
1K

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. సమాజంలో మహిళలకు విద్య అందించేందుకు ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

సమాజంలో మహిళల విద్యా విస్తరణ కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ మహిళా సాధికారతకు ఆమె మార్గం సుగమం చేశారని తెలిపారు. మహిళలు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలనే ఆమె ఆశయాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 295
Andhra Pradesh
కొమరాడలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు
కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు...
By Boiena Rajesh 2026-09-07 06:13:22 0 91
Andhra Pradesh
పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు...
By Kothuru Murali 2026-06-22 10:53:22 0 122
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 229
Telangana
ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన...
By Chunarkar Jagadeesh 2026-08-03 11:16:36 0 403
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com