భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
970

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను...గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాలికలను రక్షించాము - బాలికలను చదివింద్దాము,
గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో ఈ కార్యక్రమానికి హాజరైన హెడ్మాస్టర్ టీచర్ మరియు అంగన్వాడీ టీచర్స్...
By mahaboob basha 2025-10-14 11:21:37 0 67
Andhra Pradesh
NDA పాలనపై YSRCP ఆరోపణలు తీవ్రంగా
ఆంధ్రప్రదేశ్‌లో అధికార NDA ప్రభుత్వంపై ప్రతిపక్ష YSRCP తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ...
By Deepika Doku 2025-10-09 13:37:03 0 41
Telangana
నాలుగు రోజులుగా రోడ్లపైనే.. ఇదేం ట్రాఫిక్ కష్టాలు |
హైదరాబాద్ నగరంలోని ప్రధాన రవాణా మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌ తీవ్రంగా ప్రజలను ఇబ్బందులకు...
By Bhuvaneswari Shanaga 2025-10-08 11:11:21 0 23
Delhi - NCR
Jessica Lal Murder Case (1999): How Media Fought for Justice
Delhi - In April 1999, Jessica Lal, a model, was shot dead at a party in Delhi after she refused...
By Media Facts & History 2025-07-21 13:03:43 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com