Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.

0
205

సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు

లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ

మంత్రులు, మీడియా సంస్థలు, టీటీడీ అధికారులపైనా కేసు పెట్టాలని అభ్యర్థన

ఆంధ్రప్రదేశ్‌లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై జరుగుతున్న చర్చ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఓ డీఎస్పీ స్థాయి అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. 

 

  ప్రస్తుతం మెడికల్ లీవ్ లో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ ఈ మేరకు నిన్న గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి నారా లోకేశ్, పలు ప్రముఖ మీడియా సంస్థలు, టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు, ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను కూడా ఆయన తన ఫిర్యాదులో చేర్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వీరంతా లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

 

ఈ సందర్భంగా డీఎస్పీ నాగవరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో శ్రీకాకుళంలో పనిచేసిన తనకు, ఆ తర్వాత అనంతపురం పీటీసీకి బదిలీ చేయడంతో అక్కడికి వెళ్లడం ఇష్టం లేక సెలవులో ఉన్నానని తెలిపారు. తాను స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. లడ్డూ ప్రసాదంపై చర్చల ద్వారా కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. 

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ జూబ్లీ నగర్ లో
కరీంనగర్ : చిన్నారులకు వీడ్కోలు 
By Sunka Santhosh 2026-04-04 19:18:02 1 1K
SURAKSHA
ఇన్‌స్టా ఫొటోషూట్ విషాదం - చెరువులో 3గురు మృతి -
 మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు...
By Kalaga Sailaja 2026-06-30 06:30:36 0 92
Andhra Pradesh
ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారం
చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్...
By Vadlamudi NagaVenkat 2026-06-03 05:17:50 0 377
Telangana
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్    మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
By Sidhu Maroju 2025-08-06 08:11:31 0 845
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com