నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం

0
205

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20, 2026*

 

*నేడే (ఫిబ్ర‌వ‌రి 21) భారీస్థాయిలో ఆర్గానిక్ రైతోత్స‌వం*

- *అన్న‌దాత‌లు, ఔత్సాహికులు స‌ద్వినియోగం చేసుకోండి*

- *కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం*

- *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

ఈ నెల 21వ తేదీ శ‌నివారం ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లా సేంద్రియ మేళా-ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని.. అన్న‌దాత‌లు, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని, కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు.

ఈ నెల 21న కృష్ణారావుపాలెం, 22వ తేదీన విజ‌య‌వాడ‌లో ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీటికి చేస్తున్న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి రెవెన్యూ, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌శుసంవ‌ర్థ‌క త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సేంద్రియ వ్య‌వ‌సాయంపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు రైతుల‌కు సామ‌ర్థ్య అభివృద్ధి, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌య స్టాళ్లు కూడా ఉంటాయ‌ని, సేంద్రియ సాగుకు అవ‌స‌ర‌మైన ఉత్పాదితాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌న్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమ‌థ‌నానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు. ఇదేవిధంగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు, వినియోగ‌దారులు, సంస్థ‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ల‌క్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలోనూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ మేళాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధ‌ర ల‌భించేలా మార్కెటింగ్ లింకేజీలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఎంవోయూలపై అవ‌గాహ‌న‌తో పాటు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించి, మంచి ఫ‌లితాలు వ‌చ్చేలా అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించార

Search
Categories
Read More
Telangana
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ' బతుకమ్మ' గ్లింప్స్ ... శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను...
By Ponnala Srinivasrao 2026-05-07 04:25:39 0 173
Andhra Pradesh
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ...
By Ratna Sekhar 2026-02-28 18:53:34 0 466
Telangana
ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు...
By Ponnala Srinivasrao 2026-04-26 02:14:55 0 137
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 447
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com