Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఆటో ఢీకొని ఫీల్డ్ అసిస్టెంట్ కి తీవ్ర గాయాలు.చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మురుగేశ్ (31) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పని మీద బోయకొండకు బైక్‌పై వచ్చిన ఆయన, పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మురుగేశ్‌ను చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు0 Comments 0 Shares 159 Views 0 Reviews
-
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసి ముఖంపై కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు.0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన రమణ, ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబీకులు ఈ వివరాలు తెలిపారు.0 Comments 0 Shares 189 Views 0 Reviews
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలుమంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ హేమంత్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణ ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన హేమంత్‌ను మదనపల్లి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు #కొత్తూరు మురళి.0 Comments 0 Shares 331 Views 0 Reviews
-
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలుహనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని 108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.0 Comments 0 Shares 783 Views 0 Reviews
-
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చింతకాయలు కోసేందుకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చింతచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టుపై నుంచి కింద పడటంతో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 317 Views 0 Reviews
-
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.0 Comments 0 Shares 342 Views 0 Reviews
-
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుచీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి...0 Comments 0 Shares 713 Views 0 Reviews
-
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వ్యవసాయ పొలం నుంచి వరిగడ్డిని ఇంటికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. వాహనం నుంచి దిగేందుకు ప్రయత్నించగా, కాలు ట్రాక్టర్ చక్రాల్లో ఇరుక్కుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో గౌరమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని కూలి పనులకు గౌరమ్మను పిలవడంతో సహచర కూలీలతో కలిసి ట్రాక్టర్‌లో వెళ్లింది. జాండ్రపాళెం వద్ద ట్రాక్టర్‌పై కూర్చుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర...0 Comments 0 Shares 218 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర రెడ్డి (48) తీవ్రంగా గాయపడ్డారు. పని నిమిత్తం నిమ్మనపల్లికి వచ్చి, తిరిగి వెళ్తుండగా బైకు అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.0 Comments 0 Shares 184 Views 0 Reviews
-
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలుసామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్‌మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results