నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వ్యవసాయ పొలం నుంచి వరిగడ్డిని ఇంటికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. వాహనం నుంచి దిగేందుకు ప్రయత్నించగా, కాలు ట్రాక్టర్ చక్రాల్లో ఇరుక్కుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com