అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి

0
565

అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవాని పల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది.

ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఉంగరాల దిబ్బ గ్రామానికి చెందిన దూలప్ప, శంకరప్ప అనే భక్తులు శ్రీశైలం దైవ దర్శనార్థం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో గంటవాని పల్లె గ్రామ సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దానిని ఢీకొని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అడవి పంది అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దూలప్ప, శంకరప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Search
Categories
Read More
Telangana
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ,...
By Sidhu Maroju 2025-08-24 15:49:55 0 585
Telangana
శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్...
By Sriramula Anil 2026-06-12 04:03:46 7 1K
Telangana
కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం...
By Sunka Santhosh 2026-05-02 17:38:32 0 205
Andhra Pradesh
నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు...
By Boya Dasthagiri 2026-04-08 01:01:54 0 230
Telangana
ఇల్లు వీడింది... ఆచూకీ కరువైంది.|
● అల్వాల్‌లో వివాహిత అదృశ్యం ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-28 09:03:02 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com