Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • విజయ హైస్కూల్‌లో ఘనంగా 45వ టాలెంట్ షో
    విజయ హైస్కూల్‌లో 45వ టాలెంట్ షో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
    2 Views
  • మెప్మా. ఆర్పీ.ల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి పత్రం
    రిసోర్స్ పర్సన్స్ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దొండి స్వర్ణలత

    చాలి చాలని జీతాలతో పనిచేస్తూ డాక్రా మహిళా గ్రూపు సంఘాలను అభివృద్ధి చేస్తూ సమస్యలతో నెట్టుకొస్తున్న మెప్మా. ఆర్పీ.ల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందించమని రిసోర్స్ పర్సన్స్ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దొండి స్వర్ణలత తెలిపారు . సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి ఆమె కలెక్టర్ తో మాట్లాడుతూ. రేషన్ కార్డును పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడిలకు గురిచేస్తున్నారని వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలను అమలులో ఆర్పీ లు క్రియాశీలక పాత్ర పోషిస్తు, ప్రభుత్వం నిర్వహించే ప్రతి సర్వేను రిసోర్స్ పర్సన్స్ మాత్రమే నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. లక్షల జీతాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సర్వే చెసే అన్ని పనులను కేవలం నెలకు 6000 వేల జీతం అందుతున్న మాకు ఎలాంటి సంబంధం లేని
    రేషన్ కార్డును పంపిణీని చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు.. ఇటీవల చంద్రశేఖర్ కాలనీలో రేషన్ కార్డుల పంపిణీలో ఓ ఆర్పీకి బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె చికిత్స కోసం ఆర్పీలం అందరం చందాలు వేసుకొని, చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తున్నామని తెలిపారు.. ప్రభుత్వం ఆర్పీ లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు సర్వే చేసేవారికి , జాబ్ చాట్ ఇవ్వాలని, సర్వే లకు ప్రొసీడింగ్స్ కాపీలను ఇచ్చి, రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరారు ఒక్క లేబర్ కు రోజుకులి 600 వందల రూపాయలు ఇస్తున్నారు మా ఆర్పీ లకు రోజుకో సర్వే చేస్తున్నారు కూలీలకు ఉన్న విలువ మా ఆర్పీ లకు లేకపోవడం బాధాకరం అని తెలిపారు. ఆర్పీ లకు గౌరవ వేతనం కేవలం నెలకు 6000 వేలు . ఇస్తూ డాక్ర సంఘాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మాకు రోజుకో సర్వే చూపిస్తున్న అధికారులు మాకు కనీస వేతనం 18000 రూపాయలు అమలుచేసి ఆర్పీ లకు హెల్త్ కార్డు లు మంజూరుచేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందించే విధంగా చూడాలని తెలిపారు.మా సమస్యలు నెరవేర్చక పోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.
    2 Views
  • నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి చేస్తోందని నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పేర్కొన్నారు.

    ఇటీవల నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు కేటాయించిన రూ. 20 లక్షల నిధుల కార్యాచరణలో భాగంగా, ఈరోజు నగరంలోని డివిజన్ నంబర్ 22, 25, 35 పరిధిలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమిపూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ...
    నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి డివిజన్‌కు రూ. 20 లక్షల నిధులను వెచ్చించి డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి అత్యవసర ప్రజా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రీ ఎర్రం సుధీర్ గారు, శ్రీమతి వైష్ణవి సుధా గారు, శ్రీ చింతకాయల రాజేందర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, నాయకులు మరియు ఆయా కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు స్థానిక ప్రజలు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
    7 Views
  • రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు
    నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 5వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
    ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్‌లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
    క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
    6 Views
  • 🚩పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
    ▫️సిరికొండ మండల అభివృద్ధికి రూ.10 కోట్లతో పలు పనులకు శంకుస్థాపనలు
    ▫️మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
    ▫️సిరికొండ మహిళా సమాఖ్యకు రూ.2.02 కోట్ల విలువైన చెక్కు అందజేత
    ▫️నియోజకవర్గంలో ఇప్పటికే 3 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
    ▫️విద్య, రహదారులు, క్రీడా ప్రాంగణాలు, మహిళా సంక్షేమానికి నిధులు

    ✅రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు. గురువారం సిరికొండ మండలంలో సుమారు రూ.10 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

    🔸మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

    ✅కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.13 వేల కోట్లను కేటాయించిందన్నారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా మాత్రమే కాకుండా ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

    ✅మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందించామని పేర్కొన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా ఆర్టీసీ బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పెద్ద వ్యాపారాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ అవకాశాలు
    12 Views
  • తెనాలి సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ
    తెనాలి మండలంలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారి దుర్గాబాయి, తాసిల్దార్ గోపాలకృష్ణ,ఎంపీడీవో దీప్తి పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆయా కేంద్రాలలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది పనితీరు ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. 
    11 Views
  • బుర్రిపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన -- పెమ్మసాని.
    తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన స్వగ్రామమైన బుర్రిపాలెం లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు వచ్చి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి...
    19 Views
  • తెనాలి మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ఈరోజే...!
    గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఓటు అభ్యర్థి ఓటు వేసేదాకా అతనికి ఎటువంటి అంతరాయం కలగకుండా సూపర్వైజర్లు, ఎలక్షన్స్ సిబ్బంది జాగ్రత్త వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 65965 మంది ఓటర్లకు గాను 46331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పురుషులు 22,488,...
    15 Views
  • కొత్తగూడెం విబి-జి రామ్ జి ద్వారా శాశ్వత అభివృద్ధి పనులు
    శాశ్వత ఆస్తుల కల్పనకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. మురసు తుపాను నష్టం, వేసవి తాగునీరు, ఎల్‌నినో ప్రభావంపై పక్కా ప్రణాళికలు.   కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విబి- జి రామ్ జి పథకం ద్వారా తాత్కాలిక పనులకు బదులుగా ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రానికి మోడల్గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ...
    17 Views
  • వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    జైపూర్: మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండల తహసీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బియ్యం...
    22 Views
  • కొత్తగూడెం వృద్ధుల హక్కుల పరిరక్షణకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
    కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం. ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెల్లడి.   కొత్తగూడెం: వృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు వారికి న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జిల్లా...
    17 Views
  • కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    బెల్లంపల్లి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాలను పరిశీలించి విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థినులకు గణితంలో అందిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థినుల...
    23 Views
More Results