తెనాలి మండలంలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారి దుర్గాబాయి, తాసిల్దార్ గోపాలకృష్ణ,ఎంపీడీవో దీప్తి పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆయా కేంద్రాలలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది పనితీరు ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు.