Bharat Aawaz
🚩పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
▫️సిరికొండ మండల అభివృద్ధికి రూ.10 కోట్లతో పలు పనులకు శంకుస్థాపనలు
▫️మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
▫️సిరికొండ మహిళా సమాఖ్యకు రూ.2.02 కోట్ల విలువైన చెక్కు అందజేత
▫️నియోజకవర్గంలో ఇప్పటికే 3 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
▫️విద్య, రహదారులు, క్రీడా ప్రాంగణాలు, మహిళా సంక్షేమానికి నిధులు

✅రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు. గురువారం సిరికొండ మండలంలో సుమారు రూ.10 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

🔸మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

✅కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.13 వేల కోట్లను కేటాయించిందన్నారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా మాత్రమే కాకుండా ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

✅మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందించామని పేర్కొన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా ఆర్టీసీ బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పెద్ద వ్యాపారాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ అవకాశాలు
11 Views