Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణపెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనంకాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులుకరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు వారం...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంకాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తిపెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త లభించింది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయడంతో భవనం పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కాపు సంఘం నాయకులు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎంపీ, కళ్యాణమండపాన్ని ఆధునిక సదుపాయాలతో పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదాచరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టంపంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, ప్రాథమిక నివేదికల ఆధారంగా బాధ్యతా రాహిత్యం వహించిన అధికారులపై చర్యలు ప్రకటించారు. పెద్దాపురం ఆర్డీఓ, సంబంధిత డిఎస్పీ, జిల్లా కార్మికశాఖ అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సహా నలుగురు అధికారులను సస్పెండ్...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబువేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐవేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి...0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results