బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు

0
2K

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పరామర్శించారు. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.

ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
భరత్హ   అవాజ్ ప్రతినిధి:  హన్మకొండ  జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు...
By Prashanth Goindla 2026-05-14 10:11:54 0 371
Andhra Pradesh
నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది
 నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు...
By Boya Dasthagiri 2026-09-06 14:16:05 0 147
Andhra Pradesh
పుంగనూరు: అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వండి: ఎస్సై
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బయలు గాని పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామ ప్రజలకు సైబర్...
By Kothuru Murali 2026-04-16 17:31:17 0 162
Telangana
గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి,...
By Malla Rambabu 2026-07-18 05:54:56 0 402
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com