0 Comments
0 Shares
101 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో సోమవారం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాలకు భిన్నంగా, మానవతా దృక్పథంతో పేద కుటుంబాలను ఆదుకునే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఈ వేడుకల్లో వివరించారు.0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం – టీడీపీ శుభాకాంక్షలుచౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాటలు కాకుండా పనులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న నాయకుడిగా, అభివృద్ధికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నమ్మకానికి ప్రతీకగా ఆయనను అభివర్ణించారు. చౌడేపల్లి నేలపై ఆయన నాయకత్వం ఒక శక్తి, నమ్మకమని, ప్రజల కోసం పోరాడే ధైర్యం, సమస్యలపై నిలబడే సాహసం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు....0 Comments 0 Shares 82 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: పోలీసుల భద్రతా ఏర్పాట్లు.చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి నడివీధిలో ఏప్రిల్ 7, 8 తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అనవసరంగా వాహనాలు నిలిపివేయవద్దని, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను దగ్గరగా చూసుకోవాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
పుంగనూరు:మోదీ దీర్ఘకాలిక సేవలకు పుంగనూరులో బీజేపీ సంబరాలుచిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసిన సందర్భంగా సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ మోదీ వంటి గొప్ప నాయకుడు దొరకడం అదృష్టమని, ఆయన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మఠం బాబు, డా. జగన్నాథం, చంద్ర శేఖర్...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
పుంగునూరు:పుంగనూరు పట్టణంలో ఇంటింటికీ బీసీ చైతన్యం కార్యక్రమంపుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ బీసీ చైతన్యం' కార్యక్రమం సోమవారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు, బీసీల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబమూర్తి, యువజన విభాగం కో-కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్, సోషల్ మీడియా బాధ్యులు కుమ్మర గిరిబాబుతో పాటు పలువురు...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా ఉచిత రేషన్ బియ్యం ను ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే వారి రేషన్ కార్డులు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
పుంగనూరు: పుంగనూరు పట్టణం ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన సీఐఅన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం అధిక రద్దీ కారణంగా వాహనాలు రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పట్టణ సీఐ సుబ్బరాయుడు స్వయంగా రంగంలోకి దిగి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆయన చర్యలకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలుపుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే బాలుడు తన ఇంటి వద్ద కూర్చుని ఉండగా పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి శరీరమంతా గాయాలయ్యాయి. వైద్యుల అంచనా ప్రకారం, బాలుడు కనీసం 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. గ్రామస్తులు వీధి కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు#...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలురొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న శుభారాణి (34) పీలేరు నుంచి స్కూటీపై వస్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మహిళను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చెప్పారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 84 Views 0 Reviews