Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. స్థానిక వ్యవసాయ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ కు వినతిపత్రం అందించారు. డ్రిప్ ఎరువులో యూరియాని కల్తీ చేసి విక్రయిస్తున్నారని, దీనివల్ల టమాటా పంటకు వైరస్ సోకి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.
    299 Views
  • పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పెట్రోల్ ధర రూ. 110.34 నుంచి రూ. 113.63కు, డీజిల్ ధర రూ. 98.23 నుంచి రూ. 101.37కు పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు పెంచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి# కొత్తూరు మురళి.
    210 Views
  • పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
    పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి చెందింది. ఈ విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    221 Views
  • పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16న జరగనున్న శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు మంజునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఉంటాయని, అనంతరం శాంతి హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
    271 Views
  • చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
    ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధి గల వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9381359956, 9010402068...
    217 Views
  • మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు...
    611 Views
  • నిజామాబాద్
    ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అర్హులైన 97 మంది కి రూ.24,34,000 విలువైన చెక్కులను అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి సీఎంఆర్ ఫండ్ బిల్లులను మరికొంత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంద. 
    244 Views
  • సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్
    అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్ అలెర్ట్! ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ సూచించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని, డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 'FB, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్కులో పడినట్లే. పర్సనల్ ఫొటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు' అని హెచ్చరించారు. ఆడపిల్లల పాలిట...
    263 Views
  • బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
    ‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను వ్యవహరించలేను కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం, ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదు దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు..  ‎బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి - సీఎం రేవంత్ రెడ్డి 
    251 Views
  • పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు లో ఫైల్ ?
    సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరును పోక్సో కేసు విషయంలో వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసు మాత్రమే ఫైల్ చేశారు. దాని మీద కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ కొంతమంది బండి సంజయ్ అభిమాన లాయర్లు కోర్టు తీర్పు ఇచ్చేసిందని మీడియా ముందు హడావుడి చేశారు. ఇది కోర్టును అప్రదిష్ట పాలు చేయడమే అవుతుంది. సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా చేయడం అడ్వకేట్స్ ఎథిక్స్ కు విరుద్ధం. ఇలాంటి లాయర్ల...
    277 Views