హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం అన్నారు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించేలా అంబేద్కర్ ఆలోచనలు, చర్యలు ఉన్నాయని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో...
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి అన్నారు. గురువారం చిలుకూరులో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వాహాణపై నిర్వహించన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 'అర్హులని తెలిపారు. ఈనెల 11వ...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి రైతు రాసేట్టి రవికుమార్‌కు అపార నష్టం కలిగించింది. సుమారు 20 నుంచి 25 కుంటల విస్తీర్ణంలో సాగు చేసిన టమోటా పంటను దుప్పులు పూర్తిగా నాశనం చేశాయని, చేతికి వచ్చిన పంటను తినేయడంతో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. అధికారులు తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు# కొత్తూరు మురళి .
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ ప్రశాంతి కుమారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా చిలుకూరు రైతు వేదికలో నిర్వహించారు. సోలార్ విద్యుత్ ను వ్యవసాయానికి గృహ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు కోసం రైతులు ఐ ఎస్ ఐ స్టాండర్డ్ మోటార్లను వాడాలని కోరారు. ఈ...
ఈరోజు మున్సిపల్ అధికారులు నిర్వహించినటువంటి జాబ్ మేళలో, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రము అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,,39 వ డివిజన్ కార్పొరేటర్ మరియు బిజెపి జిల్లా కార్యదర్శి
మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు అభిలాష్ (తండ్రి కొడుకులు ), కొత్తూరు గ్రామంలో గుండారపు వెంకటేష్( 23) రైతు కుటుంబాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంచిర్యాల జిల్లా కమిటీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడుతూ వరి ధాన్యం...
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల గురించి సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి,
అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరరు
చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో అనేక మార్లు చర్చలు జరిపారు
చెన్నూరు మున్సిపాలిటీలో రూపు రేఖలు మార్చడానికే అనేక సార్లు చర్చలు...
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని...
తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలుదారులపై త్వరలో భారీ భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను (రిజిస్ట్రేషన్ విలువ) గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ పెంపుదల కనిష్టంగా 20 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు, కొన్ని కీలక ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక విలువలకు, వాస్తవ మార్కెట్ ధరలకు మధ్య ఉన్న భారీ...
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్...