Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 🌟ఎమ్మెల్యే అసలు పవర్ ఏంటి? జీతం, ఫెసిలిటీస్ & పెన్షన్ - పూర్తి చిట్టా ఇదే! 🔖

    https://youtu.be/SjL5hbUhGbg?si=147uhO_mv6X-EUpv
    3 Views
  • 🌟ట్రంప్ మాస్టర్ ప్లాన్ తిరగబడిందా? | US-Iran War Phase 2: Kharg Island Attack & Oil Crisis🔖

    https://youtu.be/cq40QAIb_Nc?si=fPvBTUwM_aUvTy1D
    3 Views
  • 🌟AQI అంటే ఉష్ణోగ్రతా? 9000 కోట్లు ఏమయ్యాి? ఢిల్లీ సర్కార్ అసలు నిజాలు! 🧐🔖

    https://youtu.be/Zqan9mG1iOg?si=G9IR7SxvEIZuaHG_
    2 Views
  • 🌟ఫెమినిజం పేరుతో బాలీవుడ్ నిశ్శబ్దంగా చేస్తున్న ఒక తీవ్రమైన విషయం 🔖

    https://youtu.be/av8efyyty4A?si=EMpHg-j-6lPqEbjW
    2 Views
  • జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 50 మంది నాయకులు, కార్యకర్తలు

    మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సమక్షంలో పార్టీలో చేరిక


    🎯- చట్టన్నవరం గ్రామంలో రాజకీయ పరిణామం
    🎯- జనసేన గ్రామ అధ్యక్షుడు అద్దంకి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చేరిక
    🎯- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే
    🎯- పాల్గొన్న స్థానిక నాయకులు, కార్యకర్తలు

    నందిగామ నవంబర్ 10 : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు అద్దంకి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    ఈ సందర్భంగా నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

    ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    5 Views
  • నందిగామలో డిసెంబర్‌లో సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల కబడ్డీ పోటీలు

    కె.వి.ఆర్. కళాశాలలో నిర్వహణకు ఏర్పాట్లు – వసతి సదుపాయాలపై కళాశాలల యాజమాన్యాలతో చర్చించిన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్


    🎯- డిసెంబర్‌లో క్రీడా పోటీల నిర్వహణ
    🎯- వసతి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
    🎯- చైతన్య, అక్షర, తేజ, డివిఆర్ కళాశాలల సహకారం
    🎯- జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాలలోనూ వసతి ఏర్పాట్లు
    🎯- టోర్నమెంట్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్న కళాశాలల యాజమాన్యాలు

    🟢నందిగామ, నవంబర్ 10 భారత్ అవాజ్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిసెంబర్ నెలలో సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనరాంజీ తెలిపారు. నందిగామలోని కె.వి.ఆర్. కళాశాల వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.

    🟢వసతి సదుపాయాలపై చర్చలు

    క్రీడా పోటీలకు హాజరయ్యే క్రీడాకారిణులు, ఇతర ప్రతినిధులకు అవసరమైన వసతి సదుపాయాల కల్పనపై వైస్ ఛాన్సలర్ నందిగామలోని చైతన్య కళాశాల, అక్షర కళాశాల, తేజ కళాశాల, డివిఆర్ కళాశాల, జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులతో చర్చించారు. పోటీల నిర్వహణకు అవసరమైన వసతి ఏర్పాట్లపై వివరాలు సేకరించారు.

    🟢సహకరిస్తామన్న కళాశాలల యాజమాన్యాలు

    ఈ సందర్భంగా కె.వి.ఆర్. కళాశాల ప్రెసిడెంట్ ఎర్రం రెడ్డి బాబురావు, కమిటీ సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్, మరినేని రమేష్ బాబు, గడపూడి శ్రీరామ్ కిరణ్, ఆళ్ల రాంబాబు, జీడీఎంఎం ప్రసాద్, ప్రవీణ్, ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజప్ప పాల్గొన్నారు.

    🟢ఏర్పాట్లపై క్రీడా విభాగం సమీక్ష

    పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ నల్లూరి శ్రీనివాసరావు, కె.వి.ఆర్. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు వివరించారు.

    నందిగామలో సౌత్ ఇండియా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, పోటీల విజయవంతానికి తప్పనిసరిగా సంపూర్ణ సహకారం అందిస్తామని వివిధ కళాశాలల యాజమాన్యాలు ఈ సందర్భంగా తెలిపారు.
    18 Views