తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలుదారులపై త్వరలో భారీ భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను (రిజిస్ట్రేషన్ విలువ) గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ పెంపుదల కనిష్టంగా 20 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు, కొన్ని కీలక ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక విలువలకు, వాస్తవ మార్కెట్ ధరలకు మధ్య ఉన్న భారీ...