Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
    కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ...
    1.1K Views
  • సాయి చరణ్ స్కూల్ విద్యార్థినికి 590 మార్కులు
    అన్నమయ్య జిల్లా సోమల మండలం, కందూరు గ్రామంలోని సాయి చరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని పఠాన్ ఫౌజియా 600కు 590 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. తమ స్కూల్ విద్యార్థులందరూ 500 మార్కులకు పైగా సాధిస్తున్నారని హెడ్ మాస్టర్ పతి, కరస్పాండెంట్ ముబారక్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జిల్లాలో టార్గెట్ సాధిస్తామని వారు తెలిపారు# కొత్తూరు మురళి .
    254 Views
  • పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
    గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు, ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది# కొత్తూరు మురళి.
    247 Views
  • పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
    పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన ఆవును పశువైద్యశాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.
    547 Views
  • హోంగార్డుల గొడవలో కారు దగ్ధం: పోలీసుల విచారణ
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలేవారిపల్లి గ్రామంలో గురువారం రాత్రి హోంగార్డులు ముని, హరిబాబుల మధ్య జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో హోంగార్డు మునికి చెందిన కారును ప్రత్యర్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలుగులోకి వచ్చింది#...
    320 Views
  • పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
    సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి సందర్భంగా భూనీలా దేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామికి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం ఆయనకు ధర్మకర్తలు మునెయ్య,...
    246 Views
  • పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
    పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించింది. హర్షిత 584, లక్ష్మీ అఖిల 580 మార్కులతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మొత్తం 35 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి తెలిపారు. 115 మంది పరీక్ష రాయగా, 91 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 80% ఉత్తీర్ణత శాతం నమోదైంది# కొత్తూరు...
    290 Views
  • "సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం తన పదవిని చేపట్టి, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.  బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, మల్కాజిగిరి మొదటి మహిళా పోలీస్...
    853 Views
  • ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధర్ని మధుకర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నీ ప్రారంభించడం జరిగింది.*    ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.*   ఈ...
    650 Views
  • "స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
    హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పోలీస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది. నూతన డీజీపీ సీవీ ఆనంద్ సోషల్ మీడియా వినియోగంపై స్పందిస్తూ, కేసులు నమోదు చేసే విషయంలో యాంత్రిక ధోరణి అనుసరించకూడదని స్పష్టంచేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు “నల్లబాలు వర్సెస్ స్టేట్” కేసులో సూచించిన మార్గదర్శకాలను తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేస్తామని...
    605 Views