సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి
09-04-2026 Thu 07:50 | Andhra
PVN Madhav Meets CM Chandrababu on Key AP Issues
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడంతో నిర్మాణ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సెంట్రల్ పబ్లిక్...
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, మరోవైపు కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆయన తెలిపారు. దీని...
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్
08-04-2026 Wed 22:19 | Andhra
Nara Lokesh Slams Jagans Unstable Politics
వైసీపీ అధినేత జగన్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకు నిలకడ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ప్రజలకు దూరంగానే...
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన భారతీయ వారసత్వ సంపదకు ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మెగా కల్చరల్ ఫెస్ట్ 2026'లో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం...
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్నత విద్యశాఖ ' బి ' గ్రేడ్ గుర్తింపునిచ్చింది. బుధవారం ఆడిట్ విభాగం సభ్యులు ఎస్. శ్రీనివాస్, బాబ్జీ కళాశాలలోని బోధనా పద్ధతులు, అకాడమిక్ రికార్డులు పరిశీలించిన అంతరం కళాశాల పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం కు ' బి ' గ్రేడ్ సర్టిఫికెట్ అందజేశారు.
# Yadagiri
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష...
Chandrababu Naidu Reviews Revenue Department Issues Key Orders
రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు భూ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తూ, వారి ఆస్తులకు పూర్తి భద్రత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న అనేక రెవెన్యూ వివాదాలకు చరమగీతం పాడుతూ, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ప్రపంచ బ్యాంక్ బృందం.. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించింది.
అమరావతిలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణలు అంతర్జాతీయంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని...
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను BRS లోకి ఆహ్వానించనున్నారని సమాచారం. ఈ మేరకు ధరూర్ కెనాల్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. ఈనెల 15 నుంచి 20 లోపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి BRS లో చేరన్నారని ప్రచారం జరుగుతుంది.
చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు, మల్లికా రాణి మరియు ఇతర శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యంగా మహిళల సంరక్షణకు, వారికి అందాల్సిన పథకాలను తెలియజేస్తూ పార్టీ...